బెంగాల్‌ తీరాన్ని దాటనున్న రెమాల్‌ తుఫాన్‌

నవతెలంగాణ  – హైదరాబాద్‌: తీవ్ర తుఫానుగా బలపడిన ‘రెమాల్‌’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రెమాల్‌ ఆదివారం రాత్రి బంగ్లాదేశాన్ని తీరాన్ని తాకిందని, బెంగాల్‌ తీరాన్ని దాటే ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.00-1.00 మధ్య తీరాన్ని దాటుతుందని, ఆ తర్వాత రెమాల్‌ తుఫాన్‌ బలహీనపడుతుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Spread the love