పాముకాటుతో పాడి గేదె మృతి

– బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వినతి
నవతెలంగాణ మిరుదొడ్డి: పాము కాటుతో గేదె మృతి చెందిన ఈ సంఘటన అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రంగణమైన కనకరాజు రోజు మాదిరిగానే గురువారం రాత్రి గేదె ను వ్యవసాయ బావి వద్ద కట్టేసి ఇంటికొచ్చాడు. శుక్రవారం ఉదయం బావి దగ్గరికి వెళ్లి చూస్తే గేదె చనిపోయి ఉండటంతో. పాము కాటు వేసిందన్న అనుమానంతో పశువైద్యాధికారులను సంప్రదించాడు. సుమారు రూ..60వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Spread the love