పల్లె పల్లెనా పండగల దశాబ్ది ఉత్సవాలు

– ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
– విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
పల్లె పల్లెనా పండుగల దశాబ్ది ఉత్సవాల నిర్వహించాలని, ప్రభుత్వ అభివృద్ధిపై ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, జూన్‌ 2 నుంచి 22 వరకు ఆవిర్భావ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సన్నహాక సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు 21 రోజులపాటు పండగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రజలను భాగ్య స్వాములను చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ జరిగి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున 21 రోజులపాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలిసేలా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పల్లె పల్లెలను జరగాలని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆ గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలలో ఇప్పటివరకు పదెండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. ఈ పదెండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శనలు జరగాలని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం ముందు తర్వాత జరిగిన అభివృద్ధి ప్రస్తుత రాష్ట్రంలో అమలుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ఆయా శాఖ అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అధికారులు ఆయా శాఖల వారీగా సమన్వయంతో పనిచేయాలి అంతా కలిసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వివిధ వర్గాల వారికి వృత్తుల వారిగా సమాజంలోని ప్రజలందరిని భాగ్యస్వాములను చేస్తూ ఆయా కార్యక్రమాలు ప్రణాళికలు రూపొం దించి ప్రజలను భాగ్యస్వామ్యం చేయాలన్నారు.

Spread the love