Wednesday, June 17, 2026
E-PAPER
Homeఖమ్మంమధిర, ఆళ్లపాడు, బోనకల్ రూట్ ని పరిశీలించిన డిపో మేనేజర్

మధిర, ఆళ్లపాడు, బోనకల్ రూట్ ని పరిశీలించిన డిపో మేనేజర్

- Advertisement -

ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ను సన్మానించిన సర్పంచ్ “కర్నాటి”
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ తడికమల్ల దేవరాజుని రాయన్నపేట సర్పంచ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు శాలువాతో శనివారం సన్మానించి అభినందనలు తెలిపారు. మధిర డిపో మేనేజర్ గా అధికార బాధ్యతలు చేపట్టిన అనంతరం డిపో మేనేజర్ తడకమళ్ళ దేవరాజు తొలిసారి మధిర నుంచి రాయన్నపేట, ఆళ్లపాడు, బోనకల్ మీదుగా ఖమ్మం కు బస్సు నడిపేందుకు రూట్ పరిశీలనకు రాహన్నపేట, ఆళ్లపాడు గ్రామాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, టిడిపి మండల నాయకుడు మరీదు బరకయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల మధిర నుండి ఖమ్మం కు రాయన్నపేట, ఆళ్లపాడు, బోనకల్ మీదుగా కొన్ని రోజులు ఆర్టీసీ బస్సు ని నడిపారు. అయితే కలకోట, రాయన్నపేట, ఆళ్లపాడు గ్రామాల మధ్య ముమ్మరంగా కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

దీంతో మధుర డిపో నుంచి నడిచే ఆర్టీసీ బస్సును కొద్దిరోజులపాటు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు నిలిపివేసిన బస్సు విషయంపై నూతనంగా డిపో మేనేజర్ గా అధికార బాధ్యతలు చేపట్టిన దేవరాజును కలిసి సమస్యను వివరించారు. దీంతో ఆయన స్పందించి ఆళ్లపాడు బస్సు రూట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాయన్నపేటలో సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావుని తడికమళ్ళ దేవరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. బస్సు రూట్ విషయంపై డిపో మేనేజర్ ఆయనతో చర్చించారు. బస్సు నడిపేందుకు రూట్ అనుకూలంగా ఉందని త్వరలోనే బస్సు సర్వీస్ ప్రారంభిస్తామని దేవరాజు కర్నాటికి తెలిపారు. ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు సాధ్యమైనంత త్వరలో బస్సును తిరిగి పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -