ఎస్ డిఎఫ్, సిడిపి నీదులతో గ్రామాల అభివృద్ధి..

– ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 44 కోట్లు ఎస్ డిఎఫ్,సిడిపి నిధులతో చాలా వరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగిందని, ఇంకా ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎన్ అర్ జి ఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి రహదారులు, డ్రైనేజీల నిర్మాణం జరిగాయని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం యానంపల్లి గ్రామంలో, గంగపుత్ర సంఘం ₹ 5 లక్షలు, యాదవ సంఘంకు ₹ 5 లక్షలు, పద్మశాలి సంఘంకు ₹ 2 లక్షల రూపాయల మంజూరు పత్రాలను వివిధ కులాల సంఘ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు టిఎస్ ఆర్టిసి, చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 44 కోట్లు ఎస్ డి ఎఫ్,సిడిపి నిధులతో చాలావరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగిందని వివరించారు., ఇంకా ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు నిర్మాణాలు చేపట్టాడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.

 

Spread the love