చేతన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ

నవతెలంగాణ-ఖమ్మం
చేతన ఫౌండేషన్‌ మహిళల స్వయం సాధికారకలో భాగంగా శిక్షణ పొందిన మహిళలకు చేతన ఫౌండేషన్‌, కొంగర భవాని జ్ఞాపకార్ధంగా కుట్టు మిషన్‌ పంపిణీ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో మహిళా లోకానికి అండగా నిలవడంలో ప్రతి సేవా సంస్థ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫౌండేషన్‌ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్‌ సభ్యులు పసుమర్తి రంగారావు, దొడ్డ సీతారామయ్య, ముత్తినేని సురేష్‌, చంద్రకాని నవీన్‌, షేక్‌ రషీద్‌, కొంగర రామచంద్ర రావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Spread the love