నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
రాజావరం గ్రామం జంగాలకాలనీ వాసులకు వెంటనే డబల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కోర్ర శంకర్‌నాయక్ అన్నారు. శనివారం రాజావరం గ్రామం జంగాల కాలనీలో పేదల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవానికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. జంగాల కాలనీ వాసులకు త్రాగడానికి నీరు లేక కరెంటు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి డబుల్ బెడరూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేములకొండ పుల్లయ్య గోపాల్, వెంకన్న, దుర్గమ్మ, సైదులు, సైడమ్మ, రాజు, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.