దసరాకి.. అవే పెద్ద మైనస్సులా..?

‘సరిగ్గా 40 నిమిషాల్లో చూపించే చిత్రాన్ని 2.32 నిమిషాల సుదీర్ఘ సినిమాగా చూపించడం, యూనివర్సల్‌గా అందరికీ తెలిసిన రొడ్డ కొట్టుడు ప్రేమ, పగ, స్నేహం కాన్సెప్ట్‌లో పస లేదంటూ ‘దసరా’ చిత్రాన్ని చూసిన నెటిజన్లు, సినీ విమర్శకులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
నాని నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా సాదా సీదా కథతో ఉండటంతో భారీ కలెక్షన్లు ఉన్నప్పటికీ ఆ అంచనాలను మాత్రం అందుకోలేక అందర్నీ నిరాశపర్చిందని వినిపిస్తోంది. ఈ సినిమా బలాలు, బలహీనతల గురించి సినీ విశ్లేషకులు, నెటిజన్ల వ్యూ ఎలా ఉందో ఓసారి గమనిస్తే, ‘కేజీఎఫ్‌, రంగస్థలం, పుష్ప, కాంతార, 1976 పలాస, మగధీర, లగాన్‌, రుద్రవీణ, ముఫ్తీ, మహా సముద్రం, గూండే, ఆర్య2.. ఇలాంటి సినిమాలన్ని ఒక్కొక్క సన్నివేశంలో గుర్తుకు రావడం, సన్నివేశాల సాగతీత, రొటీన్‌ రివేంజ్‌ డ్రామా, రా, రఫ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రఫ్‌గా కనిపించే నాని నానా సినిమాల సమ్మేళం, సుదీర్ఘ నిడివి బలహీనతలుగా, తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యం, బిజీఎం, కళా దర్శకత్వం, డైలాగ్స్‌, దర్శకుడి పని తీరు, ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు, నాని, కీర్తి సురేష్‌ల నటన బలాలుగా చెబుతున్నారు.

Spread the love