ఖనిజ నిక్షేపాల అన్వేషణకు కృషి చేయాలి

– జీఎస్‌ఐ డీజీ డాక్టర్‌ యస్‌.రాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ ఆత్మగౌరవాన్ని, సంపూర్ణ వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధి కోసం దోహదపడే ఖనిజ నిక్షేపాల అన్వేషణకు కషి చేయాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ యస్‌.రాజు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ బండ్లగూడలోని జీఎస్‌ఐ శిక్షణా సంస్థలో భూశాస్త్రవేత్తల ఐదు బ్యాచ్‌ల శిక్షణ ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్‌ఐలో ప్రతిభావంతులైన అధికారులున్నారనీ, భౌగోళిక శాస్త్రవేత్తలే సంస్థ భవిష్యత్తు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఐ ఏడీజీ యమ్‌.యమ్‌.పవార్‌, ఏడీజీ వేంకటేశ్వర రావు, డీడీజీ మాథ్యూ జోసెఫ్‌, జీఎస్‌ఐటీఐ డైరెక్టర్‌ ఆర్‌.విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love