తెలంగాణ యూనివర్సిటీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షునిగా భానోత్ సాగర్ నాయక్, ఉపాధ్యక్షులుగా చౌదర్పల్లి మహేష్ కుమార్, హరీష్, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్, నవీన్, కార్యదర్శులుగా అలియాస్, బాలాజీ, కార్యవర్గ సభ్యులుగా అపర్ణ, రమ్య, మధు, గోవింద్, రాజేందర్, రాజ్ కుమార్, మహేందర్ తదితరులు ఎన్నికై య్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లా చదువుతున్న సాగర్ నాయక్ మాట్లాడుతూ ఎన్ ఎస్ యుఐ పూర్వ అధ్యక్షుడు శ్రీశైలం యూనివర్సిటీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షుడు కోమిర శ్రీశైలం మాట్లాడుతూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థుల ప్రగతికి, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడిందని అయన వివరించారు. దానంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.