అమెరికా ఎన్నికల్లో ఈవీఎం లు వాడొద్దు: ఎలాన్ మస్క్

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎమ్) హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ(AI) సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి త్రీవ నష్టాన్ని కలుగజేస్తుంది’’అని మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాము. లేదంటే ఏం జరిగి ఉండేదో అని అనుమానపడ్డారు. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని అన్నారు. అలా చేస్తే ప్రతి ఓటును లెక్కించే అవకాశం ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు.

 

Spread the love