ఉపాధిహామీ కూలి డబ్బులు వెంటనే ఇవ్వాలి

నవ తెలంగాణ -నారాయణపేట టౌన్‌
ఉపాథి హామీ లో పనిచేస్తున్న కూలీలకు 10 వారాలు గడిచిన కూలి డబ్బులు అందడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ అన్నారు. దామరగిద్ద మండలం లోకుర్తి, పీడ్డెంపల్లి గ్రామాలలో ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామి చట్టంలో వారం వారం కూలీలకు డబ్బులు ఇవ్వాలని ఉన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నెలలు గడిచిన కూలీలకు డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు రావడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు తగ్గించడంతో కూలీలకు సకాలంలో డబ్బులు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని న్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధి హామీ చట్టానికి రెండు లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, కూలీలకు పనిముట్లు టెంట్లు, మెడికల్‌ కిట్లు, మంచినీళ్లు అందివ్వాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బాల్‌ రాజు, మహేష్‌,రాజు,సంజీవ్‌, మొగులప్ప,దేవేందర్‌, కిష్టప్ప,వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love