సింగిల్ విండోలా బకాయి డబ్బుల వసూళ్లకు కసరత్తులు

– మద్నూర్ సింగిల్ విండోలో రూ.5.30 కోట్లు,  డోంగ్లి సింగిల్ విండోలో రూ.3.50 కోట్లు బకాయిలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల పరిధిలో రెండు సింగిల్ విండోలు ఉన్నాయి. వీటి పరిధిలో దీర్ఘకాలిక రుణాల బకాయిలు తొమ్మిది కోట్లు ఉన్నట్లు ఆయా సింగిల్విండోలా అధికారుల నివేదికలను బట్టి తెలుస్తోంది. మద్నూర్ సింగిల్ విండో పరిధిలో ఐదున్నర కోట్లు డోంగ్లి సింగిల్ విండో పరిధిలో మూడున్నర కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ రెండు సింగిల్ విండోల పరిధిలో ఏండ్ల తరబడి దీర్ఘకాలిక రుణాల బకాయి డబ్బులు పెండింగ్ లోనే ఉండటం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, సింగిల్ విండోల పరిధిలో దీర్ఘకాలిక రుణాలు వాటి బకాయిలు వసూళ్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, కోట్లాది రూపాయల బకాయిల వసూళ్ల కోసం మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ సింగిల్ విండోలో రూ.5.30 కోట్లు, డోంగ్లి సింగిల్ విండోలో రూ.3.50 కోట్లు బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ద్వారా దీర్ఘకాలిక రుణాలు పొందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ, కోట్లాది రూపాయల బకాయిల వసూళ్ల కోసం సింగిల్ విండోలా అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. మద్నూర్ సింగిల్ విండో పరిధిలో 145 మంది ఖాతాల్లో ఐదున్నర కోట్లు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా డోంగ్లి సింగల్ విండో పరిధిలో 70 మంది ఖాతాల్లో మూడున్నర కోట్లు బకాయిలు ఉన్నట్లు అధికారులు అంచనాలు తెలుపుతున్నాయి. రెండు సింగిల్ విండోల పరిధిలో తొమ్మిది కోట్ల బకాయిలు, ఏళ్ల తరబడి మగ్గుతూనే ఉన్నాయి. ఇలాంటి పెండింగ్ బకాయిల వస్తువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ విండో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఏళ్ల తరబడి బకాయిలు పడ్డ కోట్లాది రూపాయల వసూళ్ల కోసం అధికారులు రుణాలు పొందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ, పెండింగ్ బకాయిలు వసూలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోతే, సింగిల్ విండోలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశంలో అధికారులకు ప్రశ్నిస్తూ, సత్వరమే వసూళ్లు చేసేందుకు ప్రయత్నించాలని, ఆదేశాలు జారీ చేయడం కోట్లాది రూపాయల బకాయిల వసూళ్ల కోసం ప్రతిరోజు సింగిల్ విండోలు అధికారులు, ఆయా సింగిల్ విండోల పరిధిలోని గ్రామాలకు వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా దీర్ఘకాలిక రుణాలు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు బకాయిదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా మద్నూర్ ఉమ్మడి మండలంలో రెండు సింగిల్ విండోల పరిధిలో 215 మంది వద్ద తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు ఉండటం విశేషం.
Spread the love