కాలువ గండ్లు పూడ్చుకుంటున్న రైతులు

నవతెలంగాణ-గోవిందరావుపేట : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్నవరం ప్రధాన చెరువులకు గండ్లు పడడంతో నాట్లు ఆలస్యం అవుతుండగా రైతులే సొంత ఖర్చులతో గండ్లు పూడ్చి కుంటున్నారు. మంగళవారం రంగాపురం కాలువ మాదిగ మత్తడి ప్రదేశంలో గండిపడగా గత ఐదు రోజుల క్రితం ఒక మారు పూడ్చగా మళ్లీ పక్క ప్రదేశంలో గండిపడడంతో రైతులు జెసిబి సహాయంతో ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలించి పూడ్చుకొన్నారు. ఏ ఈ హర్షద్ మరియు డి ఈ శ్రీనివాస్ లు కూడా దగ్గరుండి రైతులు గండ్లు పోస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇప్పటికే రైతులు ఎగరానికి 200 చొప్పున పోగుచేసుకుని కాలువగండ్లు పూడ్చుకుంటున్నారు. గుత్తేదారు నుండి రైతులు పెట్టిన సొమ్ము తిరిగి ఇచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని రైతులు అంటున్నారు.
Spread the love