మలిదశ ఉద్యమానికి పురుడు పోసిన శ్రీకాంత చారి

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ 
మలిదశ ఉద్యమానికి పురుడు పోసిన శ్రీకాంత చారి అని విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాపురం గోపాలకృష్ణాచార్య అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా నగరలోని హనుమాన్ జంక్షన్ లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాపురం గోపాలకృష్ణాచార్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమం శ్రీకాంత్ చారి ప్రాణాలర్పించడం తోనే మలి దశ ఉద్యమానికి పురుడు పోసుకొని, తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ ఉద్యమం కొనసాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు నూనె రాంచందర్ చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, హన్మాండ్లుచారి విశ్వబ్రాహ్మణ ఉద్యోగులు పాల్గొన్నారు.
Spread the love