ఖరీఫ్ సీజన్లో నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్న రైతన్నలు..

నవతెలంగాణ – రెంజల్

వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం రైతన్నలు దుక్కులు దున్ని నారుమల్లను సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని బోరు బావుల కింద ఉన్న రైతన్నలు నారుమల్లను పోసుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతన్నలు వ్యవసాయ భూములను దుక్కి దున్ని తమ పంట పొలాల్లో సారవంతమైన మట్టిని తరలిస్తూ, భూసారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు చెరువుల్లో మట్టి తీత పనులు చేపట్టాగా అట్టి చెరువు మట్టిని తమ పంట పొలాల్లోకి తరలిస్తున్నారు.
Spread the love