నిరంకుశత్వంపై పోరాట కేరటం పాపన్న 

–  గౌడ సంఘ మండలాద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
– మండలంలో ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకలు 
నవతెలంగాణ-బెజ్జంకి
మొఘలు సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు నిరంకుశ పాలనపై పోరాటం చేసిన కేరటం సర్దార్ పాపన్ననని గౌడ సంఘ మండలాద్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ పాపన్న జయంతి వేడుకలను మండల గౌడ సంఘం అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి గౌడ సంఘ నాయకులు పూలమాలలు వేసి  కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.మండల కేంద్రంలో సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చోరవచూపాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.లక్ష్మిపూర్ గ్రామంలో పాపన్న జయంతి వేడుకలను గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు.లక్ష్మినరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారి రాములు,గుగ్గీల్ల ఎంపీటీసీ కొమిరే మల్లేశం,గుండారం ఉప సర్పంచ్ రాము, ఉపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్,మండల గౌడ సంఘం నాయకులు,అయా గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.
Spread the love