నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న అతి నిరుపేదలకు పిసిసి డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాస్ అతినిరుపేదలకు పదివేల ఆర్దిక సాయం చేశారు.బాన్స్ వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన గైని గంగారాంకు ఉండటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా డిసిసి డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాస్ స్పందించి బాధితులకు పదివేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లో అతి నిరుపేదలు సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అర్హులైన పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఇక్బాల్, సీనియర్ నాయకులు చందా దత్తు, సుధులం మాజీ సర్పంచ్ పీర్యానాయక్, మొయినుద్దీన్, హన్మంత్ రావు, బేల్కొని గంగారాం, హనుమగొండ, అమృత్, లక్కలపల్లి శ్రీను, కుర్ల రవి, నాగుగొండ, పీరుగొండ, మేదరి హన్మాండ్లు, లింగప్ప, వడ్ల యాదరావు, కె యాదరావు, రాములు, గంగాధర్, ఇస్మాయిల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.