రెండు నెలల కనిష్టానికి విదేశీ మారకం నిల్వలు

ముంబయి : గత ఆరు మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా భారత విదేశీ మారకం నిల్వల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. ఆగస్టు 18తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 7.3 బిలియన్‌ డాలర్ల మేర క్షీణించి 594.888 బిలియన్లుగా ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఒకే వారంలో ఇంతగా తగ్గడం ఆరు నెలల తర్వాత ఇదే తొలిసారి. దీంతో రెండు మాసాల కనిష్టానికి మారకం నిల్వలు పడిపోయాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గాయని ఫారెక్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Spread the love