బీహార్‌ మాజీ లోక్‌సభ ఎంపికి జీవిత ఖైదు..

నవతెలంగాణ- న్యూఢిల్లీ:1995 జంట హత్యల కేసులో బీహార్‌ మాజీ లోక్‌సభ ఎంపి ప్రభునాథ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. 28 ఏళ్ల నాటి హత్య కేసులో ప్రభునాథ్‌ సింగ్‌ను 2017లో దోషిగా నిర్థారణ కావడంతో.. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జైలులో ఉన్నారు. బీహార్‌లోని మహారాజ్‌గంజ్‌, సరన్‌, సివాన్‌ ప్రాంతాల్లో ఆయనను ఉగ్రవాదిగా పరిగణిస్తారు.  సరన్‌ జిల్లాలోని మస్రఖ్‌ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్‌ ఎమ్మెల్యే అశోక్‌ సింగ్‌ జులై 3, 1995న పాట్నాలోని ఆయన అధికారిక నివాసంపై జరిగిన బాంబు దాడిలో మరణించారు. అసెంబ్లీ ఎన్నికలలో అశోక్‌ సింగ్‌ ప్రభునాథ్‌ సింగ్‌ను ఓడించారు. ఆగ్రహించిన ప్రభునాథ్‌ 90 రోజుల్లో అశోక్‌సింగ్‌ను చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో పోలీస్‌ భద్రత కల్పించాలంటూ అశోక్‌ సింగ్‌ డిజిపిని కోరారు. పోలీస్‌ స్టేషన్‌ నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా బాంబు దాడి జరిగింది. అశోక్‌ సింగ్‌ భార్య చాందినీ సింగ్‌ ఫిర్యాదు మేరకు ప్రభునాథ్‌ సింగ్‌, ఇతర నిందితులపై పాట్నా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం 1997లో సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి పాట్నాలో కేసు దర్యాప్తును ప్రభునాథ్‌ ప్రభావితం చేయగలరన్న ఆరోపణలతో ఈ కేసు అప్పటి అవిభక్త బీహార్‌లోని పాట్నా నుండి హాజరీబాగ్‌కు బదిలీ చేశారు. ప్రభునాథ్‌ సింగ్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అత్యంత సన్నిహితుడు.

Spread the love