మాజీ సీఎం కేసీఆర్​ మిస్సింగ్​..

నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్​లో పలుచోట్ల పోస్టర్స్ వెలిశాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇందిరా పార్క్ చౌరస్తా, బస్టాప్, అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ ఆఫీస్ వద్ద వాల్​పోస్టర్లు అంటించారు. ‘వరుసగా మూడుసార్లు గెలిచి కేసీఆర్ మా నియోజకవర్గానికి రాలేదు. సారు కారు పదహారు అని ఎక్కడ పరారు అయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ..! కేసీఆర్ ఎక్కడ?’ నినాదాలతో ర్యాలీ ర్యాలీ చేపట్టారు. ఆయన ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమానం ఇస్తామని గజ్వేల్​నియోజకవర్గ ప్రజలు ప్రకటించారు.

Spread the love