ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు : మాజీ ఎంపీ బలరాం నాయక్‌

నవతెలంగాణ-గూడూరు
ఐకెపి, సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధా న్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగు తున్నాయని అట్టి విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని రైతులకు న్యాయం జరిగేంత వర కు రైతులకు అండగా ఉంటామని మాజీ కేంద్ర మం త్రి పోరిక బలరాం నాయక్‌ అన్నారు. శుక్రవారం గూ డూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో గూడూరులోని ఐకెపి సొసైటీ సెంటర్లు, పొనుగోడులోని సొసైటీ సెంటర్‌, అయోధ్యపురంలోని ఐకెపి సెంటర్‌లలో ఏర్పాటు చే సిన ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించి, నిర్వా హకులచే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రై తులకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిం చారు. ధాన్యం కొనుగోలు విషయంలో అవతవకలు జరుగుతున్నాయని ఇట్టి విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని, కాంగ్రెస్‌ రైతుల పక్షాన పోరాటం చే స్తుందని, రైతులకు అండగా కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ ఉం టుందని తెలిపారు. ఈ పరిశీలనలో గూడూరు మం డల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి, బ్లాక్‌ కాం గ్రెస్‌ అధ్యక్షులు నూనావత్‌ రమేష్‌, నాయక్‌, జిల్లా మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నూనావత్‌ రాధ, మం డల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాధవపెద్ది అ మరేందర్‌ రెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ వేం శ్రీని వాస్‌రెడ్డి, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న యాదవ్‌, మండల ప్రధాన కార్యదర్శి బీరం శ్రీపాల్‌ రెడ్డి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు చంటి స్వా మి, మండల సీనియర్‌ నాయకులు చంద్రమౌళి, కన్నే బోయిన వెంకన్న, రాసమల్ల యాకయ్య, వివిధ గ్రా మాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love