గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

నవతెలంగాణ – ఆసిఫాబాద్ : సిర్పూర్ యూ మండలంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను అరెస్టు రిమాండ్ పంపించినట్లు జైన్నూర్ సీఐ అంజయ్య తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిర్పూర్ యు చెప్రి గ్రామానికి చెందిన ఆత్రం బాలర్షావ్, గురు సాంగ్ గణపతిరావు, తోడుసం భీంరావులు గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిర్పూర్ యు ఆసుపత్రి వద్ద పోలీసులు బైక్ ఆపి తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయి లభించింది. ఇరుపగూడకు చెందిన రాంశవ్ వద్ద నుంచి రూ.1500 ఇచ్చి కొనుగోలు చేసినట్లు ముగ్గురు విచారణలో తెలుపగా, రాంశవ్ ఇంట్లో దాడి చేసి తనిఖీ చేపట్టగా రెండు గంజాయి మొక్కలతో పాటు 500 గ్రాములు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంశవ్ గత కొంత కాలంగా ఇంటి ముందు గంజాయి మొక్కలు పెంచి, వాటిని ఎండబెట్టి పరిసర ప్రాంతాల యువకులకు అధిక ధరలకు గంజాయి విక్రయిస్తున్నాడు. నలుగురి నుంచి 700 గ్రాముల గంజాయి, బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Spread the love