జార్ఖండ్‌లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

నవతెలంగాణ – హైదరాబాద్: జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్ భూమ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మవోయిస్టులు హతమయ్యారు. టోంటో, గోయిల్ కెరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేసినట్లు జార్ఖండ్ అధికారులు తెలిపారు. సింఘ్ భూమ్ లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు. కాగా, శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు.

Spread the love