రూ.100 ఇస్తేనే ఉచిత రేషన్ బియ్యం..

– రేషన్ కార్డుల ముద్రణ పేరిట ప్రతి కార్డుదారుడి నుండి వసూల్
– గుండారంలో డీలర్ కుటుంబ సభ్యుల తీరుపై గ్రామస్తుల  అగ్రహం
– ఆలస్యంగా వేలుగులోకచ్చిన వైనం
నవతెలంగాణ-బెజ్జంకి
రూ.100 ఇస్తేనే వచ్చేనెల నుండి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని రేషన్ డీలర్ కుటుంబ సభ్యులు హూకుం జారీ చేస్తున్నారని మండల పరిధిలోని గుండారం గ్రామంలోని రేషన్ కార్డుదారులు ఆరోపించారు. నూతన రేషన్ కార్డుల ముద్రణ పేరిట రూ.100 కార్డుదారుల నుండి రేషన్ డీలర్ కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా వసూల్ చేస్తుండడం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వార సామాన్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే కార్డుదారుల నుండి డీలర్ కుటుంబ సభ్యులు రూ.100 వసూల్ కు పాల్పడడంపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రేషన్ కార్డులున్న వారి నుండి నూతన రేషన్ కార్డుల ముద్రణ పేరిట వసూల్ చేయడం సామాన్యులను దోపిడీ చేయడమేనని అధికారులు స్పందించి డీలర్ పై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరారు.డీలర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై నాయిభ్ తహసీల్దార్ పార్థసారధిని వివరణ కోరగా నూతన రేషన్ కార్డుల ముద్రణ పేరిట రూ.100 వసూల్ చేసిట్టు మా దృష్టికి వచ్చిందని..పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని తెలిపారు.

Spread the love