మహిళా భద్రతావిభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్యానెల్ చర్చ
సమాజంలో మార్పు రావాలన్న వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో మహిళల పట్ల ప్రదర్శిస్తున్న చిన్నచూపు, నిత్యం ఎదురయ్యే లింగ వివక్ష వారి మానసిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డి.జి. చారు సిన్హా అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్న ‘వీహబ్’ వేదికగా స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా ‘ఎవ్రీడే సెక్సిజం అండ్ ఎమోషనల్ సేఫ్టీ’ అనే అంశంపై శనివారం ప్యానెల్ చర్చ నిర్వహిం చారు. ఈ సందర్భంగా చారుసిన్హా మాట్లాడుతూ.. నిత్యం మహిళలపై జరిగే చిన్నపాటి ఎగతాళి, అసభ్యకర జోకులు నేరాల్లా అనిపించకపోవడమే అసలైన ప్రమాదమని హెచ్చరించారు. ఇవి సమాజంలో ఒక అలవాటుగా మారిపోవడం వల్ల ఎవరూ ప్రశ్నించడం లేదననీ, ఫలితంగా మహి ళలు తమకు రక్షణ ఉండాల్సిన చోట కూడా అభద్ర తా భావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకున్నప్పుడే మహిళలకు గౌరవప్రదమైన వాతావరణం లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.కార్పొరేట్ రంగం నుంచి హాజరైన శైలజ జోశ్యుల మాట్లాడుతూ.. మహిళల ఎంపికలను గౌరవించడం నేర్చుకోవాలని, పాతకాలపు మూసధోరణులకు స్వస్తి పలికినప్పుడే మార్పు సాధ్యమవుతుందన్నారు.
అనంతరం సినీ దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. మహిళా పాత్రలను సజించేటప్పుడు తాను ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తానని, మనమంతా నేర్చుకునే దశలో ఉన్నామని గుర్తించినప్పుడే సమాజంలో మెరుగైన మార్పును చూడగలమని పేర్కొన్నారు. మహిళలు తమకున్న అంతర్గత శక్తిని గుర్తించాలని చారు బిస్కట్ వ్యవస్థాపకుడు శరత్ చంద్ర కోరారు. ఆర్థిక స్వాలంబన సాధించిన మహిళలు జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలరని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మసూద్ హుస్సేనీ వివరించారు.ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ మాలిని సమన్వయకర్తగా వ్యవహరించారు. ఏడాది పొడవునా సాగే ఈ ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా ఒక సామాజిక అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఏషశీఎవఅఝటవ్yషఱఅస్త్రబ్‌ిస్త్ర ఖాతా ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
లింగ వివక్షను వీడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


