సుపరిపాలన సూపర్‌…

దశాబ్ది’ ఉత్సవాల్లో సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణా రాష్ట్రావతరణ జరిగిన తొమ్మిదేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా అభివద్ధిని సాధించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్‌, ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌ డోబ్రియల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నీటి పారుదల, వ్యవ సాయం, ఐటీ, పరిశ్రమలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం రికార్డు స్థాయి పురో గతి సాధించిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలు, మార్పులపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం రిజ్వి, వ్యవసాయ రంగం లో వచ్చిన మార్పులపై ఆ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మున్సిపల్‌ పరిపాలనపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, విధ్యుత్‌ రంగంలో సంస్కరణలపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, రాష్ట్రంలో ఆర్థిక రంగ సంస్కరణలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, విద్య రంగంలో మార్పులపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్య, ధరణిపై రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తదితరులు పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు.

Spread the love