రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నవతెలంగాణ-పుల్కల్‌
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజు శ్రీ జయపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతో సీఎం కేసీఆర్‌ అన్నదాతలకు అండగా నిలుస్తున్నానరన్నారు. ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరలకు అందించడమే కాకుండా.. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సంక్షేమ పథకాలతో రాబోయే మరోమారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు గ్రామాల నుండి రైతులు భారీ ఎత్తున తరలిరావడం సంతోషదాయక మన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు చైతన్య విజయ భాస్కర్‌ రెడ్డి, సీఈఓ ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి చైతన్య, పుల్కల్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ చారి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ మండల అధ్యక్షులు యాదగిరిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love