జీపీ కార్మికుల సమ్మె ప్రారంభం..

– పోటీ కార్మికులను నియమించిన పాలక వర్గం..
– అడ్డుకున్న జీపీ కార్మికులు..
– సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తాం సిఐటియు నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ వివిధ కేటగిరీలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని,జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.గురువారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులు భాగంగా అశ్వారావుపేట మండలం లో గ్రామపంచాయతీ కార్మికులు తమ విధులను బహిష్కరించి సమ్మె లో చేపట్టారు.సమ్మె శిబిరం వద్ద అప్పన్న అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మల్టీ పర్పస్ విధానం తీసుకువచ్చి వివిధ కేటగిరీ లను రద్దుచేసి కలం పట్టిన కారో బార్ బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అని అన్నారు. సిబ్బందితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం స్లీపర్ లకు రూ.15,600లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ లు, బిల్ కలెక్టర్లు రూ.19,500 లు నిర్ణయించాలని, ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయితీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెకు దిగడంతో పాలక వర్గం పోటీ కార్మికులను నియమించిన విషయం తెలుసుకున్న రెగ్యులర్ కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటప్పయ్య, నరసింహారావు, కామేశ్వరరావు, అప్పన్న,నందు, బుజ్జమ్మ, వరలక్ష్మి, ముత్తారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love