గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు నో

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వచ్చే ఆదివారం(11న) నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేయాలనే మరో పిటిషన్‌లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సీబీఐ విచారణపై ఇప్పటికే పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటితో పాటు ఈ పిటిషన్‌ను జత చేసి విచారణ చేస్తామని వెల్లడించింది. ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలని, సిట్‌ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన మురళీధర్‌రెడ్డి వేసిన రిట్‌పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ జస్టిస్‌ మాధవీ దేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love