నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వ్యవసాయ, సహకార శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 148 ఏవో పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు జిల్లాల్లో 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఏవో పోస్టులకు 8,961 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, వారిలో 8,074 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
వారిలో ఉదయం నిర్వహించిన పేపర్-1కు 6,546 (73.04 శాతం) మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2కు 6,519 (72.74 శాతం) మంది హాజరయ్యారని వివరించారు.