పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ను రద్దు చేసిన తర్వాతే పరీక్షలు..

– టీఎస్పీఎస్సీని ముట్టడించిన బీఎస్పీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను రద్దు చేసిన తర్వాతే గ్రూప్‌ -1 తోపాటు ఇతర పరీక్షలు నిర్వహించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి లింగం డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని బీఎస్‌పీ కార్యకర్తలతో కలిసి వారు ముట్టడించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మెన్‌ జనార్ధన్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన 16 పరీక్షా పేపర్లు లీక్‌ అయ్యాయని వివరించారు. ఈ విషయం సిట్‌, ఈడీ విచారణలో వెలుగు చూసినా కేసీఆర్‌ ప్రభుత్వం కమిషన్‌ చైర్మెన్‌ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మెన్‌ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు జూన్‌ -11 న రీషెడ్యూల్‌ విడుదల చేయడం అప్రజాస్వామికమని వారు విమర్శించారు.

Spread the love