గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలి

– ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలి : డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌, ఏఐఎఫ్‌డీవై డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయా సంఘాలు సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వల్లీ ఉల్లా ఖాద్రీ, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌ ప్రదీప్‌, ఏఐఎఫ్‌డీవై అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, వనం సుధాకర్‌ మాట్లాడుతూ ఈనెల 29,30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిందని చెప్పారు. గురుకుల బోర్డు పరీక్షలు ఈనెల 23 వరకు ఉండడంతో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని వారు డిమాండ్‌ చేశారు. జాబ్‌ క్యాలండర్‌ను ఏటా ప్రకటించకపోవడం వల్లే ఇలాంటి గందరగోళం ఎదురవుతున్నదని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌ క్యాలండర్‌ను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందురు సాగర్‌, కోలా లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love