‘గ్రూప్‌-4’కు పరీక్షలకు వసతులు కల్పించాలి

రాష్ట్రంలో వివిధ విభాగాలలోని ఖాళీలను భర్తీ చేయుటకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం మంచి విషయం. అందులో భాగంగా 8039 ఖాళీల భర్తీకి జులై ఒకటిన స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌4 రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో వేల సంఖ్యలో పరీక్షా కేంద్రాలు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు తోడుగా వారి తల్లిదండ్రులు, సంరక్షకులు మొత్తం దాదాపు మూడు లక్షల మంది ఆరోజు ప్రయాణం చేస్తారు. ఈ పరీక్షా కేంద్రాలకు రాకపోకలు సాగించుటకు ఆర్టీసీ ఉచితంగా ప్రత్యేకమైన బస్సులు రాష్ట్రమంతటా నడపాలి. ఒక్కరోజే కాబట్టి బస్సులు తప్పక ఉచితంగా నడపాలి. ఇంతే కాక ఆటోలు ఇతర ప్రయివేటు వాహనాల వారు కూడా అభ్యర్థులకు వారి సంరక్షకులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం చేయుటకు చేయూత నివ్వాలి. మామూలు చార్జీలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగార్థులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సొంత వాహన దారులు వారు ప్రయాణిస్తున్న దిశలో ఒకవేళ అభ్యర్థులు కనిపిస్తే వారికి సహకరించి వారు పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకంగా రైళ్లు ఉదయం సికింద్రాబాద్‌ నుండి కాగజ్‌నగర్‌ , మధిర నిజామాబాద్‌ ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌ నల్గొండ వికారాబాద్‌ తాండూరు అదేవిధంగా సికింద్రాబాద్‌ వైపు వచ్చుటకు పై ప్రాంతాల నుండి పరీక్ష అయిన తదుపరి అభ్యర్థులు వారి గమ్యస్థానాలు చేరుటకు తగు విధంగా నడిపించుటకు ఏర్పాటు చేయించాలి. తద్వారా అభ్యర్థులు ఎటువంటి కష్టనష్టాలకు గురికాకుండా తోడ్పడాలి. ఇది మన రాష్ట్ర యువత భవిష్యత్తు కాబట్టి కేంద్ర, రాష్ట్ర విషయం అనే భేషజాలకు పోకుండా అన్ని పక్షాల వాళ్లు సహకరించాలి. అది కేంద్ర ఉద్యోగమైనా, రాష్ట్ర ఉద్యోగమైనా అభ్యర్థులు తెలంగాణ వారే కాబట్టి అధికారులు రాజకీయ నాయకులు ఈ పరీక్ష సాఫీగా అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలకు రాకపోకులకు సాగించుటకు విస్తతమైన ఏర్పాట్లు చేయాలి. అదికాకుండా ఈ పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహిస్తున్నందున మంచినీరు, మధ్యాహ్నం భోజనవసతి ఏర్పాట్లను స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద హౌటల్స్‌వారు రాయితీల మీద అందించాలి. ఇవన్నీ సాఫీగా జరిగేలా ప్రభష్ట్రత్వం చొరవ తీసుకుంటే అభ్యర్థులు ఆందోళనలు లేకుండా పరీక్ష రాయగలుగుతారు.
దండంరాజు రాంచందర్‌రావు,
9849592958

Spread the love