బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు: హనుమంతు షిండే

నవతెలంగాణ – మద్నూర్
జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం మద్నూర్ డోంగ్లి మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు, అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి జుక్కల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు బన్షి పటేల్  స్వగ్రామం అయినా లచ్చన్ గ్రామం లో కార్యకర్తల తో సమావేశం అయిన మాజీ ఎమ్మెల్యే కార్యకర్తల కృషి పట్ల అభినందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు, బీఆర్ఎస్ పార్టి కుటుంబ మహాశయులకు హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. గత కొన్ని నెలలుగాజహీరాబాద్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం అహర్నిశలు, శక్తివంచన లేకుండా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడంతో నాయకుల్లో కార్యకర్తలు షిండే ధన్యవాదాలు పట్ల నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Spread the love