ఘనంగా సైకిల్ దినోత్సవం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
శారీరక, మానసిక దృఢత్వ ఆరోగ్యకరమైన జీవన పెంపొందించుకునేందుకు సైక్లింగ్ ఉపయోగపడుతుందని నసురుల్లాబాద్ ఎంపిపి పాల్త్య విఠల్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రు యువజన సంఘం ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీని ఎంపిపి పాల్త్య విఠల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి విఠల్ మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి పాలపోసే వాళ్ల దగ్గరి నుంచి మొదలు.. పేపర్‌‌ బాయ్స్​, పోస్ట్ మ్యాన్​ల వరకు సైకిల్​ లేనిదే పని కాదు.
కానీ, ఇప్పుడు. ఎటు చూసినా, ఖరీదైన కార్లు, రయ్​మని దూసుకెళ్లే డుగ్గుడుగ్గు బండ్లు. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్లు రకరకాల వెహికల్స్​ వాడుతున్నారు. మనదేశంలో సైకిల్​ను 2004 వరకు బాగా వాడేవాళ్లు. ఏ ఊళ్లో చూసినా సైకిళ్లు చాలా ఎక్కువగా కనిపించేవి. అంతెందుకు పెండ్లిండ్లకి కట్నకానుకల్లో సైకిల్‌‌ పెట్టడం ఆనవాయితీగా కూడా ఉండేది అప్పట్లో. సొంతంగా సైకిల్​ లేకపోయినా పావలా, అర్థ రూపాయి ఇస్తే సైకిల్​ అద్దెకు దొరికేది ఒకప్పుడు. దాంతో సైకిళ్లు అద్దెకు ఇచ్చే సెంటర్లు పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు బాగానే ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ పిల్లల సైకిల్స్​ రిపేరింగ్ చేసే సెంటర్లు ఉన్నాయి. ఆధునికమైన బైకులు, కార్ల రాక‌తో సైకిళ్ల వాడ‌కం పూర్తిగా త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం నిరుపేద వాహనంగా నిలిచిపోయింది. మ‌న‌లో ఎవ‌రైనా సైకిల్ తొక్కుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారంటే చూసిన‌వాళ్లంతా ఎగ‌తాళి చేస్తుంటారు. ఇదే వంక‌తో మ‌నం సైకిల్ తొక్క‌డానికి నామోషీ అవుతుంటాం. సైకిల్ వాడకం, సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపిపి పాల్త్య విఠల్ పేర్కొన్నారు…ఈ నాటి కార్యక్రమంలో చిన్నారులు, యువత సైక్లింగ్ ఔత్సాహికులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. ఫిట్నెస్ పెంపొందించుకోవడానికి.. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి సైకిల్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వివిధ గ్రామాల నుంచి సైకిల్ నడిపే పిల్లలకు పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను ఎంపిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రు యువజన సంఘ్ నాయకులు సునీల్ రాథోడ్ గ్రామస్తులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love