జూన్‌ 6 నుంచి హెచ్‌సీఏ సీజన్‌

– లీగ్‌ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఈ ఏడాది లీగ్‌ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఎన్నికైన ఆఫీస్‌ బేరర్లు అంతర్గత కుమ్ములాటలతో ఆటకు అన్యాయం చేస్తున్నారని, హెచ్‌సీఏ ప్రక్షాళనకు ఏక సభ్య కమిటీ ఎల్‌. నాగేశ్వరరావును సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్నికల ప్రక్రియ కసరత్తు చేస్తూనే, మరోవైపు క్రికెట్‌ సీజన్‌ షెడ్యూల్‌ సైతం రూపొందించారు. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో అడ్మినిస్ట్రేటర్‌ దుర్గాప్రసాద్‌, సీఈవో సునీల్‌ 2023 సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. రంజీ ట్రోఫీ తరహాలో ప్రమోషన్‌, డిమోషన్‌ విధానం తీసుకొచ్చిన హెచ్‌సీఏ.. డివిజన్‌ ఏ, డివిజన్‌ బి, డివిజన్‌ సి విభాగాల్లో మ్యాచులు నిర్వహించనుంది. ఎ డివిజన్‌లో 21, బి డివిజన్‌లో 62, సి డివిజన్‌లో 105 జట్లు పోటీపడనున్నాయి. ప్రతి విభాగంలో జట్ల ఎంపిక, ఆటగాళ్ల ఎంపికకు అవసరమైన అర్హతలను హెచ్‌సీఏ స్పష్టంగా పేర్కొంది. జూన్‌ 6 నుంచి లీగ్‌ సీజన్‌ ఆరంభం కానుంది.

Spread the love