హింది మిలాప్‌ ఎడిటర్‌ వినయవీర్‌ మృతి

హింది మిలాప్‌ ఎడిటర్‌ వినయవీర్‌ మృతి– ముఖ్యమంత్రి రేవంత్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హింది మిలాప్‌ సంపాదకులు వినయవీర్‌ అనారో గ్యంతో శనివారం హైదరాబాద్‌లో కన్నుమూసారు. 72 ఏండ్ల వినరు దక్షిణాదిలో హింది బాషాభివృద్ధి కోసం చివరి వరక సేవలందించారు. జర్నలిస్టుగా, ఫోటోగ్రా ఫర్‌గా ఆయన సుప్రసిద్ధులు. ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటని పలువురు తమ సంతాపం తెలిపారు. అంతిమ యాత్ర ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరా బాద్‌లోని కట్టెలమండిలో గల ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్‌లోని విస్పర్‌ వ్యాలీ మహాప్రస్థానం వరకు కొనసా గుతుంది. అనంతరం అత్యక్రియలు నిర్వహిం చనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీ మిలాప్‌ పత్రిక ఎడిటర్‌ వినరు వీర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటని అన్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌గా వినరువీర్‌ హిందీ మీడియాకు అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love