పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర..

నవతెలంగాణ – పంజాబ్: పంజాబ్‌లోని మోగాలో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆప్ పార్టీకి మేయర్‌ పదవి దక్కింది. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్‌కు చెందిన నితికా భల్లాను మేయర్ పదవి నుంచి తప్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ సందర్భంగా 50 మంది కార్పొరేటర్లలో 48 మంది సమావేశానికి హాజరయ్యారు. 48 మంది కౌన్సిలర్లలో 41 మంది తమ పార్టీకి అనుకూలంగా ఓటేశారని ఆమ్ ఆద్మీ పార్టీ మోగా ఎమ్మెల్యే డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చెప్పారు. భల్లాకు కేవలం ఆరుగురు కౌన్సిలర్ల మద్దతు లభించగా, ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.

Spread the love