కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అలా ఇలా ఎలా’. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలవుతున్న ఈ చిత్ర ఆడియో లాంచ్ హిందూపూర్‌లో భారీ జనసందోహం సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది. జులై 21న ఈ చిత్రం భారతదేశం అంతటా ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. నిర్మాత మాట్లాడుతూ, ‘నేను నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక హిందూపూర్‌లో జరగడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ’83 రోజులు మంచి మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మా దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు’ అని హీరో శక్తి వాసుదేవన్ అన్నారు. ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ అధినేత ఆదినారాయణ మాట్లాడుతూ, ‘సినిమా చూసాను. మణిశర్మ సంగీతం, హీరో శక్తి నటన అద్భుతం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. స్క్రీన్‌ప్లే చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.