Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా

ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా

- Advertisement -

టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె ఎస్సీ 57 ఉప కులాల నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉంటే అందులో 47 కులాలకు ఆర్డీవోలు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అన్ని ఉప కులాలకు తహశీల్దార్ లు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఉప కులాల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని కోరారు. లిడ్ క్యాప్ భూముల్లో దళిత పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఉప కులాల్లోని విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలన్నారు. ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉప కులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉప కులాల్లోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ 57 ఉప కులాల ఐక్య వేదిక అధ్యక్షులు చింతల రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

​సీఎం రేవంత్ రెడ్డి ఒక తాలిబన్
విద్యాశాఖను సర్కర్ తీరుగా మార్చి ఆడపిల్లలు, పేదలను చదవులకు దూరం చేసేలా ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక తాలిబన్ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. క్రమేణా విద్యా ప్రయివేటీకరణకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 27 వేల స్కూళ్లలో పని చేస్తున్న 3 లక్షల మందికిపైగా ప్రభుత్వ టీచర్లను ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. విద్యాశాఖలో అన్ని వైఫల్యాలేననీ, సీఎం ఆ శాఖపై పట్టు కోల్పోయారని తెలిపారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ముఖ్యమంత్రి కనీసం సమీక్షించలేదనీ, రూ.11 వేల కోట్ల ఫీ రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా జీవో నెంబర్ 7 పేరుతో తప్పించుకుంటున్నారని ఆమె విమర్శించారు. జీవో నెంబర్ 7ను వెంటనే రద్దు చేయాలనీ, ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని కవిత డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -