Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌రాహుల్‌‌గాంధీ మౌనం వీడాలి

‌రాహుల్‌‌గాంధీ మౌనం వీడాలి

- Advertisement -

సీఎం రేవంత్‌‌రెడ్డి నియంతృత్వ పద్ధతులపై మందలించాలి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌గాంధీ వ్యూహాత్మక మౌనం వీడాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ‌డిమాండ్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి నియంతృత్వ పద్ధతులపై మందలించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌సోమవారం ఎక్స్‌ ‌వేదికగా స్పందించారు. ఏఐసీసీ సిద్ధాంతాల ముసుగును తొలగించి ఆల్‌ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని కోరారు. మొహబ్బత్‌ ‌కా దుకాన్‌ ‌కాస్తా హిట్లర్‌ ‌కా మకాన్‌‌గా మారిపోయిందా?అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వ విధానాలకు, స్థానిక కూల్చివేతలకు జర్మన్‌ ‌నియంత హిట్లర్‌ స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడాన్ని ఖండించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు ఫాసిస్టు పాలనా ఆలోచనా విధానానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం రేవంత్‌‌రెడ్డిని మందలించకుంటే ఆ నియంతృత్వ పద్ధతులను కాంగ్రెస్‌ అధిష్టానం సమర్థించినట్టే అవుతుంని తెలిపారు. ప్రజాస్వామ్య నాయకుడు రాజనీతిజ్ఞుల నుంచి స్ఫూర్తి పొందుతాడని గుర్తు చేశారు. కానీ అధికారం తలకెక్కిన పారనాయిడ్‌ ‌పాలకుడు క్రూర నియంతల నుంచి పాఠాలను వెతుక్కుంటాడని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -