రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మట్టిలో కల్పుతం

–  మౌలిక సుత్రాల పునాదులు ద్వంసం 
– జీవించే హక్కు.. మాట్లాడే స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితి
– కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరు  ఖండించాలి
– ప్రతి పౌరుడు రాజ్యాంగ రక్షణకై సైనికుడిలాగా కదలిరావాలి 
– మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
మనువాదులు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మట్టిలోకల్పుతం.న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాలు మూల స్థంబాలుగా  భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే  దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మనం నిర్మించుకున్నాం. కాని నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యంగంలోని మౌలిక సుత్రాల పునాదులు ద్వంసం అవుతున్నాయి. అని తెలంగాణ మాల మహానాడు  రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాజ్యాంగా రక్షణ యాత్ర బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా డిఈవో ఆఫీస్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల  వేసి అనంతరం మాట్లాడారు. జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వ  ఫాసిస్టు పాలనలో ప్రజలను కులాలుగా, మతాలుగా విడగొడుతూ మనువాద వారసత్వాన్ని అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను సహజ వనరులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుంది. కార్పొరేట్ ఆర్థిక విధానాల దుష్పలితాల వల్ల పేద, ధనిక వర్గాల మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుంది. ఆహార అలవాట్లపై జాతీయవాదం పేరుతో దళిత మైనారిటి వర్గాలపై జరిగిన దాడులనుండి మణిపూర్ లో గిరిజన మహిళను వివస్త్రను చేసిన సంఘటన వరకు రాజ్యాంగ హక్కులను కేంద్రం కాలరాస్తునే ఉందని  దుయ్యబడ్డారు. అంతే కాకుండా గిట్టుబాటు ధరకోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ప్రజాస్వామిక పోరాటాన్ని అణిచివేసి రైతులను బలిగొన్నది.
ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్విర్యం చేస్తు దేశ ఆర్థిక స్వావలంబనకే ముప్పుగా మారింది. డార్విన్ జీవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని పాఠశాల నుండి తొలగించి శాస్త్రీయమైన ఆలోచన నుండి విద్యార్థులను దూరంచేసే కుట్ర చేశారు. ఎన్ ఆర్ సి, సిఏఏ  పేరుతో ఈ దేశ పౌరులలో అభద్రత భావాన్ని పెంచింది. దళితుల అస్థిత్వాన్ని దెబ్బతీసి వారిని ఈ దేశంలో ఒంటరిగా చేసే కుట్రలకు తెరలేపింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలుచేయడం లేదు. అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాస్తుంది. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రశ్నించేటువంటి గొంతుకలను అణిచివేస్తూ కుట్ర కేసులు పెడుతుంది. రాజ్య వ్యవహారాలల్లో మత జోక్యం ఉండొద్దనే నియమాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగ మౌలిక సూత్రమైన లౌకిక వాదమును అపహస్యం చేస్తున్నది. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అనే వరకు తెగించారు. కులాలు, మతాలు ఆధారంగా పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నారు. మనిషిని మనిషిగా చూడకుండా మతంగా చూస్తు ఈ దేశ రక్షణ కవచమైన రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరం ఖండించాల్సి ఉంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యంగ హక్కు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన భాద్యత మనందరిపై ఉంది. పీడిత సామాజిక వర్గాలను సంఘటిత పరిచి రాజ్యంగాన్ని రక్షిస్తూ మనువాద పాసీతాన్ని పాతర వేయడానికి జాతీయ మాల మహానాడుగా మా వంతు భాద్యతగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగా రక్షణ యాత్రను చేపడుతున్నాం అని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులు అందరూ రాజకీయాలకతీతంగా మద్దతు తెలిపి రాజ్యాంగా రక్షణలో భాగస్వాములు కావాలని  ఏప్రిల్ 8 న హైదరాబాద్ లో జరిగే ముగింపు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు పెద్ద ఎత్తున తరలిరావాలని,
కులాలకు, మతాలకు అతీతంగా  ప్రతి పౌరుడు రాజ్యాంగ రక్షణకై సైనికుడిలా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్, జై భీమ్ సైనిక్ దళ్ కన్వీనర్ అసాది పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బోగరి విజయ్, నాగరాజు,  జిల్లా నాయకులు యాదగిరి, వినయ్, తెలగమల్ల మురళి, చింతపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love