ఒక్కసారి గెంతానంటే…

ఒక్కసారి
గెంతానంటే...– కంగారు ఆస్ట్రేలియాకి చెందిన జంతువు. ఆ దేశ జాతీయ చిహ్నం కూడా.
– వీటిల్లో 47 రకాల వరకు ఉన్నాయి.
– ఇవి గుంపులుగా జీవిస్తాయి. కంగారుల గుంపుని మాబ్‌ అంటారు.
– ఇవి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆహారాన్ని తీసుకోడానికి ఇష్టపడతాయి.
– కంగారులు మాక్రోపస్‌ కుటుంబానికి చెందినవి. ‘మాక్రోపస్‌’ అంటే ‘పెద్ద పాదం’ అని అర్ధం.
– కంగారూలు నడవవు, పరుగెత్తవు. గెంతుతాయి.
– వీటి కాళ్ళు చాలా బలంగా వుంటాయి. గంటకి 40 మైళ్ళు ప్రయాణిస్తాయి.
– ఇవి ఒక్క గెంతులో మూడు మీటర్ల ఎత్తు, 7.6 మీటర్ల దూరం దూకగలుగుతాయి.
– గట్టిగా ఉండే వీటి తోక కంగారులు దూకేటపుడు శరీరాన్ని బాలన్స్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
– అప్పుడే పుట్టిన కంగారు పిల్లలను సంరక్షించడానికి ఆడ కంగారుల పొట్ట దగ్గర సంచిలాంటి నిర్మాణం ఉంటుంది. బ బుల్లి కంగారుని జోరు అంటారు.
– కంగారు పిల్లలకి పాలు తాగడం రాకపోతే తల్లి కంగారు కండరాల సహాయంతో పాలధార పిల్లల నోట్లో పడేలా చేస్తుంది. బ ఇవి వెనక్కి వెళ్ళలేవు.
– కంగారూలకి ఎక్కువ నీరు అవసరం లేదు. కొన్ని సార్లు నెలల తరబడి కూడా నీరు లేకుండా జీవిస్తాయి. బ ఇవి వేడి వాతావరణంలో నీడలో విశ్రాంతి తీసుకుంటాయి.

Spread the love