మూడవరోజు చేరిన మధ్యాహ్న భోజన వంట కార్మికుల నిరవధిక సమ్మె…

– ఎమ్మార్వో ,ఎంఆర్సి, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేత.
– డిమాండ్లు నెరవేర్చే వరకు వంటలు బంద్..
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
 మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ వారి డిమాండ్ల సమస్య పరిష్కారం కొరకై కొనసాగిస్తున్న సమ్మె మూడో రోజుకు చేరింది ఈ సందర్భంగా బుధవారం నాడు ఎంఆర్సి ఎమ్మార్వో ఎంపీడీవో కార్యాలయ అధికారులకు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వంటలు చేయమని అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము మధ్యాహ్న భోజన వంట కార్మికుల ప్రభుత్వం జీవో 8నీ వెంటనే అమలు చేసి బకాయి వేతనాలు చెల్లించాలని, వంట కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించి కార్మికులకు ఉద్యోగ భద్రత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువులను ఆహారాన్ని ప్రైవేట్ ఏజెన్సీలను ఇవ్వరాదని తెలిపారు .9, 10 తరగతి విద్యార్థులను వండి వడ్డించినందుకు వంట కార్మికులకు వేతనాలు చెల్లించి పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుగుణంగా కోడిగుడ్లు, గ్యాస్, ఇతర నిత్యావసర వసుల ధరల కనుగుణంగా మెనూచార్యులు పెంచి చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం వంట సామాగ్రి నిత్యాసర వస్తువులను సరఫరా చేశానని హామీ ఇచ్చి నేటికీ పంపిణీ చేయనందుకు వంట చేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయి బిల్లులను వెంటనే చెల్లించానని అధికారులకు బిక్షపాటన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలో వంట చేసిన కార్మికులందరూ పాల్గొన్నారు.
Spread the love