2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

నవతెలంగాణ – ఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాలు చాలా వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మన దేశం మాత్రం నిలకడగా అభివృద్ధి వైపు సాగిపోతోందని చెప్పారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా యోజన ద్వారా యువతకు ఇప్పటి వరకు రూ.25 లక్షల కోట్లు రుణాలుగా అందించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పీఎం ఆవాస్ యోజన పథకంలో పెద్ద పీట వేశామని, లబ్దిదారులలో 70 శాతం మంది మహిళల పేర్లపైనే ఇళ్లు అందజేశామని నిర్మల వివరించారు. మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతోందని వివరించారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి చెప్పారు.
కోటి ఇండ్లుకు.. 300 యూనిట్ల విద్యుత్ ఉచితం
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ విధానం కింద కోటి ఇండ్లపై సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్‌  విద్యుత్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దీని వలన ప్రతి కుటుంబానికి ఏటా రూ.15 నుంచి 18 వేలు  ఆదా అవుతుందన్నారు.  వినియోగం పోగా మిగిలిన విద్యుత్ ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చునని తెలిపారు. ఇక మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని గుర్తుచేశారు సీతారామన్.  మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న  అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హెల్పర్లను  ఆయష్మాన్  భారత్ కిందకు తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్  ప్రకటించారు. 9- నుంచి18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రస్తుతం  ఆయష్మాన్  భారత్ కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తో్ంది కేంద్రం.
పేదల కోసం 2 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తాం
రాబోయే ఐదేళ్లలో.. 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి.. పట్టణ, గ్రామీణ పేదలకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారామె.పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించబోయే 2 కోట్ల ఇళ్లను.. బస్తీల్లోని పేదలు, అద్దె ఇంటిలో ఉండే పేదలకు కేటాయించనున్నట్లు వెల్లడించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం అని.. జిల్లాల వారీగా ఇళ్ల కేటాయింపు ఉంటుందని.. పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాబోయే ఐదేళ్లకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించారామె.
ఏటా 11.8 కోట్ల రైతన్నలకు పీఎం కిసాన్‌..
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోంది. జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చాం. 3000 ఐటీఐలు, ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్‌లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాం. గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది.
భారీ ఎత్తున రుణసాయం..
పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయ్యింది. స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం.
80 కోట్ల మందికి ఉచిత రేషన్‌..
‘‘గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయి. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు. పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. దాదాపు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం.

Spread the love