ఇందుమతి ఇరవై ఆరవ మరణం

”లేదు.. ఇంత చిన్న విషయానికే చచ్చిపోతాను అంటుంటేనూ. అయినా మీకొచ్చింది అంత పెద్ద కష్టమేం కాదు. మీరు మీరనుకునేంత అసమర్థులూ కాదు. అంత ‘ అసమర్థులే అయితే వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయే డ్రెస్సుని ఐదు వందలకే బేరకొవ్వొత్తి వెలుగులో అలాంటిదే ఇంకో కవిత రాసుకుంటూ మళ్ళీ అదే ఇందుమతి.
మునుపటి రాత్రి ఆమె మరోసారి మానసికంగా మరణించింది. గుప్పెడంత స్వచ్ఛమైన ప్రేమకోసం అలా ఎన్నిసార్లు మరణించడానికైనా సిద్ధంగానే ఉంది.మాడి తీసుకొచ్చే వాళ్ళు కాదు. మీలోనూ స్కిల్స్‌ ఉన్నాయి. కాకుంటే వాటిని నిరూపించుకోవడానికి అవకాశం రావాలంతే. మీరేమీ అనుకోనంటే నేనో మాట చెప్తాను. వారం వారం నా దగ్గరికి సంపత్‌ అని ఓ కస్టమర్‌ వస్తాడు. అతనో పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి నేను మీ గురించి చెప్తాను. అతను ఖచ్చితంగా మీకు ఇంటర్వూ ఏర్పాటు చేస్తాడు. నా మాట విని ఈ ఒక్కసారికి ట్రై చెయ్యండి. ఓకేనా?”
సీలింగుకేసి చూస్తున్న ఆమె కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు చెవుల మీదుగా జారి, కురులలోకి వెళ్ళి దాక్కున్నాయి. ఆ శరద్రాత్రి ఆమె కలలన్నీ శిశిరంలో రాలే ఆకుల్లాగా రాలిపోయి, మనసు మోడు వారిపోయింది. అతన్నుంచి ఇందుని తీసుకెళ్ళి ఎక్కడో దిగంతాలకి అవతల పడేసింది. పొద్దున లేచి చూసే సరికి ఆమె అతని పక్కన లేదు. మళ్ళీ అదే వేశ్యా గహం. మళ్ళీ అదే చీకటి గది. కొవ్వొత్తి వెలుగులో అలాంటిదే ఇంకో కవిత రాసుకుంటూ మళ్ళీ అదే ఇందుమతి.
మునుపటి రాత్రి ఆమె మరోసారి మానసికంగా మరణించింది. గుప్పెడంత స్వచ్ఛమైన ప్రేమకోసం అలా ఎన్నిసార్లు మరణించడానికైనా సిద్ధంగానే ఉంది.
ఆ వేశ్యా గహపు గదుల నిండా చీకటి పరుచుకుని ఉంది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు. జీవం లేని కళ్ళల్లో కదలాడుతూ కనిపించే కారు చీకటి. జీవశ్చవాల గుండెల్లో మెదలాడుతూ నివసించే కటిక చీకటి.
చిక్కటి చీకటి.
దాన్ని కొంచెం పలచబరచడానికి అన్నట్టు తన గదిలో చిన్న కొవ్వొత్తినొకదాన్ని వెలిగించింది ఇందుమతి. ఆ కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం అప్పుడే వెన్నెల్లో వికసించిన కలువపువ్వులా కనిపించింది. ఒంపుసొంపులతో కూడిన తన పాలమీగడ రంగు దేహం చీర కప్పని చోటల్లా చిత్రంగా మెరిసింది.
చేతిలోని కొవ్వొత్తిని టేబుల్‌ మీద అతికించి, పక్కనే ఉన్న మంచం మీద బోర్లా పడుకుని తన డైరీలో ఏదో రాసుకోవడం మొదలుపెట్టిందామె.
‘సువిశాల సముద్రంలో చుక్కాని లేని నావలా నేను… ఏదో సుడిగుండం వైపు సాగిపోతున్నాను.
ఈ వినీల గగనంలో ఒంటరి చకోరమునై నేను… ప్రతి నిశీథీ ప్రేమకై పరితపిస్తున్నాను.’
రెండు వాక్యాలు రాసేటప్పటికీ ఎవరో తలుపు తట్టిన చప్పుడు.
”తీసే ఉంది” అరిచింది ఇందుమతి.
తలుపు కిర్రుమంటూ తెరుచుకుంది. ఓ పాతికేళ్ళ యువకుడు లోపలికి వచ్చి, తలుపేశాడు.
అస్థిపంజరానికి చర్మం తొడిగినట్టు ఉన్నాడతను. నిరాశా, నిస్పహలు అతని కళ్ళని ఎక్కడో లోతుల్లోకి ఈడ్చుకెళ్ళున్నాయి. జుట్టూ, గడ్డం గుబురుగా పెరిగి ఉన్నాయి. మాసిపోయిన బట్టలు అక్కడక్కడా చిరిగి ఉన్నాయి. ఓసారి అతన్ని ఎగా దిగా చూసి, ”రండి. కూర్చోండి.” పైకి లేచి, పక్క సర్దుతూ అంది ఇందుమతి.
అతను మాట్లాడకుండా వచ్చి మంచం మీద కూర్చుని, గదంతా కలియజూడసాగాడు.
”ఈ గదిలో కొంచెం ఉక్క పోస్తుంది. అడ్జస్ట్‌ చేస్కోండి” అంటూ తను కండోమ్‌ ప్యాకెట్‌ తీసి అతని చేతికి అందివ్వబోయింది. అతను వద్దన్నట్టు చేతిని అడ్డుగా పెట్టాడు.
”ఇష్టం లేదా?” అంది తను కొంచెం సంశయంగా.
”అవసరం లేదు” అన్నాడతను క్లుప్తంగా.
”ఏరు! రోగాలొస్తారు. పట్టుకో ముందు”
”నాకు ఎటువంటి రోగం ఉండే అవకాశం లేదు. మీకేమైనా ఉండి నాకొచ్చినా పర్వాలేదు.”
”ఏం?”
”ఇవ్వాలో రేపో చావడానికి సిద్దపడిపోయిన వాడికి అలాంటి పట్టింపులేవీ ఉండవు లెండి”
మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో విషాదం తప్ప, ఎదురుగా కూర్చున్న ఆడదాన్ని ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అనే ఆత్రం కానీ, ఆవేశం కానీ కనబడలేదు ఇందుమతికి. అతను మాట్లాడే విధానం కూడా మరి కాసేపట్లో ఉరి తీయబడే ఖైదీ ఎలాగైతే చావడానికి సిద్దంగా మారి విరాగిలా మాట్లాడతాడో అలాగుంది. ఒక్క క్షణం అతని మీద జాలేసిందామెకి. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అతని చేతి మీద తన చేతిని ఉంచింది ఆమె. ఆ చేయి చల్లగా తగిలిందతనికి. వెంటనే అతను ఆమెను గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు.
అరగంట గడిచింది.
అతను బట్టలు వేసుకుని బయటకు నడిచాడు. అతని వెనకే ఇందుమతి కూడా హడావిడిగా చీర కట్టుకుని, హేండ్‌ బ్యాగ్‌ తగిలించుకుని గదిలోంచి వెళ్ళిపోయింది.
ఆ కొంత సమయంలో ఆమె అతన్ని ఎంత దగ్గరగా తీసుకుందో చెప్పడానికి సాక్ష్యంగా ఓపెన్‌ చెయ్యని కండోమ్‌ ప్యాకెట్‌ ఒకటి ఆ మంచం మీద ఒంటరిగా మిగిలిపోయింది. వెలుగుతున్న కొవ్వొత్తి పూర్తిగా కరిగిపోయి ఆరిపోయింది.
***
ఆమె రోడ్డు మీదకి వచ్చే సరికి అల్లంత దూరంలో వెళ్తూ కనిపించాడతను.
”ఓరు నిన్నే…” పిలిచిందామె. అతను వెనక్కి తిరిగి చూసాడు.
”ఆగు. వస్తున్నా.” అంటూ దగ్గరికెళ్ళి, ”మీ పేరేంటి?” అనడిగింది చిరునవ్వుతో.
”అనవసరం” అనేసి ముందుకు నడిచాడతను వేగంగా.
”సరే ఎప్పుడు చచ్చిపోదామనుకుంటున్నారు?” అతని పక్కనే నడుస్తూ మళ్ళీ అడిగింది తను. ”ఇంకా డిసైడ్‌ కాలేదు. ఇవ్వాలే కావొచ్చేమో!”
”ఎలా చచ్చిపోవాలనుకుంటున్నారు?”
ఆగి కోపంగా చూశాడతను.
”అంటే చాలా రకాలుగా సూసైడ్‌ చేసుకుంటారు కదా. మీరెలా చేసుకుంటారోనని…” వెటకారంగా చూస్తూ అంది ఇందు.
”ఏం నవ్వులాటగా ఉందా మీకు? నేనెలా చస్తే మీకెందుకు?” పెదాలు వణుకుతుండగా అన్నాడతను.
”అవును మీరెలా పోతే నాకేం, కాకపోతే చిన్న రిక్వెస్ట్‌.”
”తొందరగా చెప్పండి. నాకు ఓపిక లేదు.” అతని ముఖంలో చిరాకు.
”ఏం లేదు. నైట్‌ నాకు కావాల్సిన వాళ్ళది ఒకర్ది బర్త్‌ డే పార్టీ ఉంది. ఒక్క దాన్నే పోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఇప్పటికే ఏడు గంటలయ్యింది. వచ్చేసరికి అర్ధరాత్రి అవ్వొచ్చు. సో.. ఏమనుకోకుండా ఈ ఒక్క రోజు మీ చావుని వాయిదా వేసుకుని నాకు తోడుగా రాగలరా?.”
తన పరిస్థితి తెలిసి కూడా ఆమె అలా అడుగుతున్నందుకు వింతగా చూశాడతను.
”ప్లీజ్‌.” అందామె.
”ఏంటి తమాషాలు ఆడుతున్నారా?!”
తల అడ్డంగా ఊపింది ఇందు అమాయకంగా చూస్తూ. ఆ చూపుల్లో వెటకారం మాత్రం ఇంకా అలానే ఉంది. ”సారీ. నాకు కుదరదు.” నిర్మోహమాటంగా చెప్పాడతను.
”దయచేసి కాదనకండి. ఈ టైంలో మీరు తప్ప నాకెవరూ హెల్ప్‌ చెయ్యలేరు. అసలే ఈ మధ్య ఆడవాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరగాల్సొస్తోంది. ఇంకా నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయండీ. లేకపోతే ఎప్పుడో సూసైడ్‌ చేసుకోవడానికి ట్రై చేసుందును… మీలాగే.”
చివరి మాట ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించిందతనికి. ఇక మాట్లాడి లాభం లేదనుకుని అక్కడ్నించి కదిలి వెళ్ళబోయాడతను. ఇంతలో చటుక్కున ఆమె అతని చేయి పట్టుకుంది. ఆ చేయి ఇది వరకటిలాగే చల్లగా ఉంది. ”అదే నా స్థానంలో మీ అక్కో, చెల్లో ఉంటే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారా? చివరి సారిగా అడుగుతున్నా వస్తారా? రారా?.” ఈసారి ఆమె గొంతు సీరియస్‌ గా ధ్వనించింది.
కొద్దిసేపు ఆమె ముఖంలోకి సూటిగా చూసాడతను. తర్వాత ఏమి ఆలోచించుకున్నాడో ఏమో ఒకసారి గట్టిగా నిట్టూర్చి ”సరే పదండి.” అన్నాడు.
”కూ” నవ్వింది ఇందు.
”బస్‌ ఎన్ని గంటలకి” అన్నాడతను.
ఆమె వాచీ చూసుకుని, ”ఇంకా ఇరవై నిముషాలుందిలెండి. ఈలోపు మీరు బట్టలు కొనుక్కుందురు గాని రండి” అంది.
”నాకెందుకు బట్టలు?”
”లేకపోతే ఈ అవతారంలోనే వస్తారా పార్టీకీ?” అతనేదో మాట్లాడే లోపు దగ్గర్లోని బట్టల షాపు కేసి నడిచిందామె. ఇష్టం లేక పోయిన అతనికి వెళ్ళక తప్పలేదు.
ఒక మంచి ఫార్మల్‌ డ్రెస్‌ సెలక్ట్‌ చేసి, అతని చేతికి అందించింది ఇందు. బిల్లు దాదాపు వెయ్యి రూపాయిలు అయ్యింది. అతనికి బేరమాడడం సుతరామూ నచ్చదంటున్నా వినకుండా, అతని చేత బేరమాడించి దాన్ని ఐదు వందలకే కొనేలా చేసిందామె.
తరువాత బర్త్‌ డేకి కావాల్సినవన్నీ కొనుక్కుని ఇద్దరూ బసెక్కారు. వెళ్తున్నంత సేపు అతనేమీ మాట్లాడలేదు. ఇందు మాత్రం అప్పుడప్పుడు అతని వైపు చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంది.
టైం దాదాపు తొమ్మిదిన్నర అవుతుండగా నగరపు శివార్లలోని ఓ వద్ధాశ్రమం ముందు ఆగిందా బస్సు. ఆశ్రమం లోపల మొత్తం యాభై మంది దాకా ఆడవాళ్ళు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ వద్దులే. అందరూ అనాథలే. వాళ్ళందరి మధ్యలో రోగంతో మంచాన పడివున్న వాళ్ళలాంటి మరో ముసలావిడ.
ఇందుని చూడగానే ఉన్నట్టుండి ఆవిడ ముఖంలో ఎక్కడలేని వెలుగు కనిపించింది. దగ్గరకు పిలిచి ఏదో మాట్లాడుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇందు ఆమెను ఓదార్చింది. అందర్ని పిలిచి తాను తెచ్చిన కేకుని ఆ ముసలావిడ చేత కట్‌ చేయించింది. అక్కడున్న ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫలహారాలను పంచి పెట్టింది.
అతను కొంచెం దూరంలో నిలబడి అదంతా శ్రద్ధగా గమనించసాగాడు.
ఆ హడావిడి కాస్త సద్దుమనిగాక ఇందూ, అతనూ వెళ్ళి ఆశ్రమ ప్రాంగణంలోని ఓ రాతిబల్ల మీద ”ఎవరు వీళ్ళంతా?” అడిగాడతను.
కూర్చున్నారు.
”ఒకప్పుడు వేశ్యలు. ఇప్పుడు కుటుంబంతో సహా అందరూ వెలి వేసిన అభాగ్యులు. అంతే కదా ఈ సమాజం. పాలిచ్చినన్ని రోజులు పశువుల్ని సైతం ఎంతో మర్యాదగా చూసుకుంటుంది. ఇవ్వడం మానేసిన రోజు నిర్దాక్షిణ్యంగా ఏ కసాయి కొట్టుకో అమ్మేస్తుంది” చేతి గాజుల్ని సవరించుకుంటూ చాలా సాధారణంగా చెప్పిందామె.
”అయితే వీళ్ళందరినీ ఇప్పడు మీరే చూసుకుంటున్నారా?”
”లేదు నేనొక్కదాన్ననే కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు వస్తుంటారు. తమకు తోచిన సాయమేదో చేస్తుంటారు. వెళ్ళిపోతుంటారు.” అని ఆగి, ”మా గురించి అన్నీ అడుగుతున్నారు బానే ఉంది. మరి మీ సంగతేంటి?” అంది ఇందు.
దానికతడు కాస్త తటపటాయించి ”నాదీ అనాథ బ్రతుకే.” అన్నాడు.
ఆమె తల తిప్పి తన వైపు చూసింది. అతను తలొంచుకుని చెప్పడం మొదలుపెట్టాడు.
”చిన్నప్పటి నుంచీ నా అనే వాళ్ళు లేకుండా రోడ్ల మీదే పెరిగాను. ఆ పనీ, ఈ పనీ చేస్తూ మొత్తానికి గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేశాను. వెంటనే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, నా జీవితం ఒక కొలిక్కి వస్తుందనుకున్నాను. కానీ అదే సమయానికి రెసిషన్‌ మొదలైంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళనే తీసేసే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఇంటర్వ్యూలకు అటెండ్‌ అయినా ఫలితం లేకపోయింది. ప్రయత్నించి ప్రయత్నించీ నాకూ విసుగొచ్చింది. ఈ నిరుద్యోగం, ఆకలీ వీటన్నింటితో రోజూ ఒంటరి పోరాటం చేస్తూ బతకడం కన్నా సుఖంగా చనిపోతే బాగుణ్ణు అనుకున్నాను. తర్వాత ఇంకేమీ ఆలోచించలేదు. సరాసరి నా దగ్గరున్న డబ్బులతో మీ దగ్గరికొచ్చాను. మీరేమో నా దారిన నన్ను పోనివ్వకుండా ఇక్కడికి దాకా తీసుకొచ్చారు.” అంటూ ముగించాడతను.
ఇందుకి అతను చెప్పిందంతా విన్నాక నవ్వొచ్చింది.
”ఎందుకు నవ్వుతున్నారు?” అర్థం కాక అడిగాడతను.
”లేదు.. ఇంత చిన్న విషయానికే చచ్చిపోతాను అంటుంటేనూ. అయినా మీకొచ్చింది అంత పెద్ద కష్టమేం కాదు. మీరు మీరనుకునేంత అసమర్థులూ కాదు. అంత ‘ అసమర్థులే అయితే వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయే డ్రెస్సుని ఐదు వందలకే బేరమాడి తీసుకొచ్చే వాళ్ళు కాదు. మీలోనూ స్కిల్స్‌ ఉన్నాయి. కాకుంటే వాటిని నిరూపించుకోవడానికి అవకాశం రావాలంతే. మీరేమీ అనుకోనంటే నేనో మాట చెప్తాను. వారం వారం నా దగ్గరికి సంపత్‌ అని ఓ కస్టమర్‌ వస్తాడు. అతనో పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి నేను మీ గురించి చెప్తాను. అతను ఖచ్చితంగా మీకు ఇంటర్వూ ఏర్పాటు చేస్తాడు. నా మాట విని ఈ ఒక్కసారికి ట్రై చెయ్యండి. ఓకేనా?” అతను దిగాలుగా ముఖం పెట్టాడు.
”ప్లీజ్‌. ఒప్పుకోండి.”
ఆమె అంతలా బతిమిలాడుతుంటే కాదనలేక చాలా ఇబ్బంది పడుతూ సరేనన్నట్టు తలాడించాడతను.
***
అప్పట్నించి తరచూ అతనూ ఇందూ కలుసుకునేవారు. ఆమె అతనికి ఇంటర్వ్యూకి కావాల్సిన మెటీరియల్స్‌ అన్నీ కొనిచ్చేది. అతను వాటిని శ్రద్ధగా చదివి ప్రిపేర్‌ అయ్యేవాడు.
అనుకున్నట్టుగానే ఓ రోజు అతనికి సంపత్‌ పని చేస్తున్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. వెళ్ళి అటెండ్‌ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పోస్టును భర్తీ చేయడం కోసం జరిగిన ఆ ఇంటర్వ్యూలో అతను మాత్రమే పాసయ్యాడు. అతనికా ఉద్యోగం వచ్చింది.
ఆరు నెలల పాటూ అతనా ఉద్యోగంలోనే కొనసాగాడు. అదే సమయంలో వాళ్ళిద్దరి స్నేహం కూడా చాలా బలపడింది. ఎప్పుడూ కలుసుకున్నట్టే ఆ సాయంత్రం కూడా ఇద్దరూ ఓ పార్కులో కలుసుకుని, పిచ్చాపాటి ఏదో మాట్లాడుకుంటుంటే మాటల మధ్యలో అతను చెప్పాడు.
”నాకు యూరోప్‌ లో ఉన్న కంపెనీ హెడ్‌ ఆఫీస్‌ కి ఆన్‌ సైట్‌ వెళ్ళే అవకాశం వచ్చింది. ఒక సంవత్సరమంతా అక్కడే ఉండి పని చేయాలి. అక్కడ మా ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న క్రిటికల్‌ ఎంప్లారు ఒకరు అనారోగ్యం పాలైతే ఆ ప్లేస్‌ లో నన్ను వెళ్ళమన్నారు. మంచి ప్యాకేజీ కూడా ఇస్తామన్నారు”
”వా కంగ్రాట్స్‌. ఎప్పుడు ప్రయాణం?” చప్పట్లు కొడుతూ అడిగింది ఇందు.
”రేపు సాయంత్రమే బయల్దేరాలి.”
”తొందరగానా!”
”. కొంచెం ఎమర్జెన్సీ. అనుకున్న టైం కి ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ చెయ్యాలి కదా” సిగరెట్‌ వెలిగించాడతను. ఒక దమ్ము లాగి, ”వెళ్ళే ముందు నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను.” అన్నాడు.
ఇందు ఏంటన్నట్టు చూసింది.
”ఏం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” ఆమె వైపు చూడకుండా, సిగరెట్‌ యాష్‌ కిందికి కొడుతూ ఠక్కున అన్నాడతను.
అతనలా అనగానే ఒక్కసారిగా తెరలు తెరలుగా నవ్వింది ఇందు. ఆమె అంత బిగ్గరగా నవ్వడం అతనెప్పుడూ చూడలేదు. అతనికి ఎప్పటిలానే ఆ నవ్వుకి అర్థం కూడా బోధపడలేదు.
”ఐ యామ్‌ సారీ.. అయినా నీకు సడెన్‌గా అలా ఎందుకు అనిపించింది?” వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అడిగింది ఇందు.
”ఎందుకంటే ఈ రోజు నేనిలా ఉండడానికి కారణం నువ్వే. నువ్వు నా జీవితం మొత్తం తోడుగా ఉంటే ఏదైనా సాధించగలననే చిన్న ధైర్యం. అందుకే అడుగుతున్నాను.”
ఇందు కొద్దిసేపు అతన్ని పిచ్చివాడిని చూసినట్టు చూసింది.
”ఇంతకీ నీ అభిప్రాయం ఏంటి?” అడిగాడతను.
”నా అభిప్రాయం ఏముంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నాకు ఇంతకుముందు పాతిక మంది మగాళ్ళు చెప్పారు. అందరూ మోసమే చేసారు. వాళ్ళ చేతిలో మోసపోయిన ప్రతిసారీ నేను మానసికంగా చచ్చిపోయాను. వారిలో ఒకరిద్దరి వల్ల ప్రెగెన్సీ కూడా వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడానికి రెండుసార్లు అబార్షన్స్‌ జరిగాయి. డాక్టర్లు ఇక మీదట నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేశారు. చాలా బాధ పడ్డాను. అయినా ఏదో రోజు నన్ను నిజంగా ప్రేమించే మనిషి నా జీవితంలోకి వస్తాడనే ఆశ మాత్రమే నన్నింకా ఈ భూమ్మీద బతికేలా చేస్తోంది. ఆ ఆశ నీ ద్వారా నెరవేరుతుందంటే చాలా సంతోషంగానే ఉంది. కానీ ఇవన్నీ తెలిసినా నువ్వు…”
”ఫారిన్‌ నుంచి రాగానే ఖచ్చితంగా నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఇదే నా నిర్ణయం.” ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ అన్నాడతను.
ఇందు అతనికేసి ఆశ్చర్యంగా చూసింది.
కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాక కళ్ళ నిండా నీళ్ళతో అతన్ని కౌగిలించుకుంది.
***
అతను వెళ్ళిన రోజు నుండీ ఇందు వేశ్యా వత్తిని మానేసి, టైలరింగ్‌ నేర్చుకుంది. దాని మీద వచ్చే డబ్బులతోనే ఒక మామూలు జీవనాన్ని గడుపుతూ అతని కోసం ఎదురు చూడసాగింది. ఇప్పుడామె దగ్గర లిప్‌ స్టిక్‌ మెరుపులు, ఘాటైన అత్తరు వాసనలు, తళుకు బెళుకు దుస్తులు ఇవేవి లేవు. ఒక సాదా సీదా మహిళా ఎలా ఉంటుందో అలా ఉందామె.
క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారి కాలమనే నదిలో కరిగిపోతుంటే, సంవత్సరం రోజులు భారంగా వెళ్ళిపోయాయి.
అతనొచ్చాడు. ఎయిర్‌ పోర్టులో ఇద్దరూ కలుసుకున్నారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ్నించి దగ్గర్లో ఉన్న రెస్టారెంట్‌ కి వెళ్ళి డిన్నర్‌ చేశారు. తింటున్నంత సేపూ ఇందు అతన్నే చూస్తూ ఉండిపోయింది. అప్పటికీ, ఇప్పటికీ అతని వేషభాషల్లో ఎంతో మార్పు వచ్చింది. నిజానికి అది ఆమెకి ఒకింత గర్వాన్ని కలిగించింది. సంతప్తినిచ్చింది.
తినడం పూర్తయ్యాక ”నెక్స్ట్‌ ఏంటి?” అడిగిందామె.
అతను చేతులు కడుక్కుని, టిష్యూతో తుడుచుకుంటూ ”అవును చెప్పడం మర్చిపోయాను. నేనొక ఫ్లాట్‌ కొన్నాను. రేపే గహప్రవేశం. మనం ఈ రాత్రికి ఎక్కడైనా ఉండి పొద్దునే అక్కడికి వెళ్లాం” అన్నాడు. ఇందు పొంగుకొస్తున్న ఉత్సాహాన్ని అణచి పెట్టుకుంటూ ”అలాగే” అంది.
***
పదిహేను నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉన్నారు. డ్రెస్‌ చేంజ్‌ చేసుకొని పక్కనొచ్చి కూర్చున్న అతనితో తను అప్పటిదాకా దాచుకున్న భావాల్ని చెప్పడానికి నోరు తెరవబోయింది ఇందు. అంతలోనే అలాగే ఉండిపోయిందామె.
అతను అమాంతం తన పెదవులతో ఆమె పెదవుల్ని మూసేశాడు. ఆమె కూడా దానికి అడ్డు చెప్పలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. తరువాత ఏమైందో ఏమో గానీ ఉన్నట్టుండి అతనామెను దూరంగా నెట్టేశాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా తన బ్యాగు తెరిచి, అందులోంచి కండోమ్‌ ప్యాకెట్‌ బయటికి తీసి తొడుకున్నాడు. చూస్తున్న ఇందు ఎందుకో నిర్వేదంగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం ఏంటని అతను అడగనూలేదు. ఆమె చెప్పనూలేదు. అతని కింద నలుగుతున్నంత సేపూ శవంలా, చలనం లేకుండా నిస్త్రాణంగా చివరికి అతను అలసిపోయి అటు తిరిగి పడుకోగానే, సీలింగుకేసి చూస్తున్న ఆమె కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు చెవుల మీదుగా జారి, కురులలోకి వెళ్ళి దాక్కున్నాయి. ఆ శరద్రాత్రి ఆమె కలలన్నీ శిశిరంలో రాలే ఆకుల్లాగా రాలిపోయి, మనసు మోడు వారిపోయింది. ఒక్క కండోమ్‌ పొరంత దూరం అతన్నుంచి ఇందుని తీసుకెళ్ళి ఎక్కడో దిగంతాలకి అవతల పడేసింది.
పొద్దున లేచి చూసే సరికి ఆమె అతని పక్కన లేదు.
మళ్ళీ అదే వేశ్యా గహం. మళ్ళీ అదే చీకటి గది.
***
కొవ్వొత్తి వెలుగులో అలాంటిదే ఇంకో కవిత రాసుకుంటూ మళ్ళీ అదే ఇందుమతి.
మునుపటి రాత్రి ఆమె మరోసారి మానసికంగా మరణించింది. గుప్పెడంత స్వచ్ఛమైన ప్రేమకోసం అలా ఎన్నిసార్లు మరణించడానికైనా సిద్ధంగానే ఉంది.
– వెంకట్‌ ఈశ్వర్‌, 8297258369

Spread the love