పని ప్రదేశంలోఉపాది కూలికి గాయలు

– ఆసుపత్రిలో బాధితురాలుకు డిఆర్డీఓ పరామర్శ
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా పని ప్రదేశంలో గడ్డపారతో మట్టిని తవ్వుతుండగా ప్రమాదవశాత్తు గునపం తగిలి విజయగిరి జయ అనే కూలికి తీవ్రమైన గాయాలైన సంఘటన   మండలంలో ఎడ్లపల్లి గ్రామంలోని ఊర చెరువు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక కూలీల పూర్తీ కథనం ప్రకారం రోకులాగే జయ ఉపాధి హామీ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు చేతిలో గునపం దిగడం వలన తీవ్రంగా గాయపడడం జరిగిందన్నారు.విశయాన్ని ఉపాధిహామీ ఏపీఓ హరీష్ దృష్టికి తీసుకపోగా వెంటనే చికిత్స కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదాన్ని ఏపీఓ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.భూపాలపల్లి డిఆర్డీఓ పల్లికొండ నరేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలును పరామర్శించి జయ అనే ఉపాది కూలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టుగా ఏపీఓ తెలిపారు.
Spread the love