నవతెలంగాణ-మాదాపూర్
హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన పూజా రెడ్డి ప్రస్తుతం మాదాపూర్ పర్వత్‌నగర్ సమీపంలోని శ్రీ చైతన్య సరస్వతి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 389 మార్కులు సాధించిన ఆమె, బెటర్‌మెంట్ పరీక్షలకు సన్నద్ధమవు తున్నట్టు సమాచారం.
అయితే చదువు ఒత్తిడి కారణంగా కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్ మూడో అంతస్తులోని గది నంబర్ 305లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తండ్రి గోపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



