ఐఏఎస్‌ అధికారులతో పాలనను అడ్డుకుంటుంది

–  కేంద్రంపై కేజ్రీవాల్‌ విమర్శలు
న్యూఢిల్లీ :మోడీ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో ఢిల్లీ పాలనను నియంత్రించాలని భావిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు. మంగళవారం నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీ (ఎన్‌సీసీఎస్‌ఏ) మొదటి సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను లాక్కుందని అన్నారు. మంత్రులకు బదులుగా అధికారులకు బాధ్యతలను కట్టబెట్టిందని, ఆర్డినెన్స్‌ ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీని కేంద్రం కన్నా ఉన్నత స్థానంలో ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం ఐఏఎస్‌లకు ఉందని అన్నారు.
ఎన్‌సీసీ ఎస్‌ఏ సమావేశానికి కొద్ది రోజుల ముందు ఓ అధికారి సస్పెన్షన్‌కు సంబం ధించిన ఫైల్‌ తనకు అందిందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలు లేవనెత్త డంతో ఆ ఫైల్‌ తిరిగి తన దగ్గరకు రాకుండా.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాల యానికి వెళ్లిందని.. ఎన్‌సీసీఎస్‌ఏకు చెందిన ఇద్దరు సభ్యులు ఆమోదించ డంతో ఆ అధికారి సస్పెండ్‌ అయ్యారని అన్నారు. త్వరలో ఆర్డినెన్స్‌ తో పాటు ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నామని అన్నారు.

Spread the love